![]() |
![]() |

సూపర్ జోడి డాన్స్ షో స్టార్టింగ్ ఎపిసోడ్ లో పింకీ మానస్ తో కలిసి ఎంత సందడి చేసిందో అందరికీ తెలుసు. ఐతే ఈ రాబోయే వారం షోలో మాత్రం పింకీ కనిపించలేదు..అసలేం జరిగిందో చూద్దాం. సూపర్ జోడి షో నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో ప్రియాంక కనిపించలేదు. యాంకర్ శివ వచ్చి సోలోగా "ముద్దేమో మునసబుకు పెట్టేసానే" అనే సాంగ్ కి డాన్స్ పెర్ఫార్మ్ చేస్తుండగా జడ్జ్ మీనా సాంగ్ ఆపమని చెప్పింది. దాంతో శివకి అసలక్కడ ఏం జరుగుతోందో అర్ధం కాక డాన్స్ చేయడం ఆపేసాడు. వెంటనే మీనా "అదేంటి శివా.. పింకీని తీసుకొస్తానని వెళ్లారు కదా.. మరి మీరు మాత్రమే వచ్చి డాన్స్ చేస్తున్నారు ఏమయ్యింది " అని అడిగేసరికి శివ ఏదో ఆన్సర్ చెప్పబోయాడు. ఇంతలో పింకీ చేతిలో ఒక పేపర్ ని పట్టుకుని నడవలేక నడవలేక నడుస్తూ వచ్చి స్టేజి మీద కుర్చీలో కన్నీళ్లు పెట్టుకుంటూ కూర్చుంది.
ఐతే ఇంతకు పింకీకి ఏమయ్యిందో తెలీలేదు. కానీ ఈ ప్రోమో చూసిన నెటిజన్స్ మాత్రం ఇన్స్టాగ్రామ్ లో తమ తమ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. "పింకీ ఆరోగ్యం జాగ్రత్త..గెట్ వెల్ సూన్...మీనా గారు పింకీ హెల్త్ బాలేదండి అర్థం చేసుకుంటే సరిపోతుంది ...పింకీకి అసలు ఏమయ్యింది.. టిఆర్ పి రేటింగ్ కోసమా...పేమెంట్ ఇష్యూ ఉందా...ప్రాక్టీస్ చేసేటప్పుడు కాలు ఫ్రాక్చర్ అయ్యిందా." అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఐతే పింకీకి నిజంగానే కాలుకు ఏమన్నా ఇబ్బంది అయ్యిందా...లేదంటే ఇంకేమన్నా ఇష్యూ అయ్యిందా...అనే విషయం గురించి తెలియాలి అంటే సండే ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. ప్రియాంక జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ ని స్టార్ట్ చేసి ఒక్కో అడుగు ఎదుగుతూ ఇక్కడి వరకు వచ్చింది. నిజానికి ఒక అబ్బాయి ఐనా కూడా అమ్మాయిగా ఉండడమే తనకు ఇష్టం కాబట్టి సర్జరీ చేయించుకుని అమ్మాయిగా ట్రాన్సఫార్మ్ అయ్యింది. ఇక తర్వాత ఇంట్లో వాళ్ళు ఆమెకు అంతా యాక్సెప్ట్ చేయడం మొదలు పెట్టారు. అలాగే తాను కష్టాల్లో ఉన్నప్పుడు నాగబాబు దేవుడిలా ఆదుకున్నారని చెప్పింది పింకీ. అలాంటి పింకీకి ఇప్పుడు అసలేమయ్యింది ?
![]() |
![]() |